కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల నిరసనలు దిష్టిబొమ్మలు దహన
నవతెలంగాణ -మొఫిషియల్
నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించడాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలు, పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో పలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సీపీఐ(ఎం) జూబ్లీహిల్స్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో రహమత్ నగర్‌లోనిఎస్.పి.ఆర్ హిల్స్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఓయూలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాచారంలో సీఐటీయూ ఆధ్వర్యంలో తెలంగాణ ఫుడ్స్ బస్టాండ్ వద్ద కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కాప్రాలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో మల్లాపూర్ ఎలిఫెంటా చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వ ర్యంలో హనుమకొండలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. మహబూబాబాద్ తహ సీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎంఎల్) న్యూడె మోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వ ర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రయివేట్ జూనియర్ కళాశాలలో ప్లకార్డులు ప్రదర్శించారు. ములుగు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట తెలంగాణ అమరవీరుల స్థూపం ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. చిట్యాలలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. భువనగిరి జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం), యాద గిరిగుట్ట పట్టణ కేంద్రంలో సీఐటీయూ ఆధ్వ ర్యంలో నల్ల బ్యానర్ పట్టుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు. భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద మోడీ దిష్టిబొమ్మను సీపీఐ(ఎంఎల్) న్యూడె మోక్రసీ ఆధ్వర్యంలో దహనం చేశారు. మహబూబ్‌నగర్‌లోని భగత్ సింగ్ విగ్రహం వద్ద డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నారా యణపేట జిల్లా కేంద్రంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణ ముఖ్య కూడలిలో విద్యార్థులు నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష, అభ్యుదయ సంఘాల నాయ కులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు లెల్లెల బాలకృష్ణ మాట్లాడారు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జికి ఖండన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



