Wednesday, July 22, 2026
E-PAPER
Homeజాతీయంరాహుల్ స‌హా పలువురి అరెస్టు

రాహుల్ స‌హా పలువురి అరెస్టు

- Advertisement -


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

​విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని, విద్యార్థులపై దాడికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ ‌షా రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ‌మంగళవారం లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని మోడీ నివాసానికి రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు మార్చ్ నిర్వ‌హించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసగా చేతులకు సంకెళ్లతో రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు అక్కడే బైటాయించారు. విద్యార్థుల‌కు మ‌ద్ద‌తుగా కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ ను తొల‌గిం‌చాలని నినాదాల హోరెత్తించారు. పార్ల‌మెంట్‌లో విద్యార్థులపై జ‌రిగిన క్రూర‌త్వంపై స‌మ‌గ్ర చ‌ర్చ జ‌రిపి ద‌ర్యాప్తు చేయాల‌నీ, నీట్ పేప‌ర్ లీక్‌పై కేంద్ర ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాల‌నీ, విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ జ‌ర‌గాల‌నీ, నీట్ మృతులకు రూ. కోటి పరిహారం చెల్లించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దాదాపు మూడు గంటలకు పైగా ఆందోళ‌న చేప‌ట్టారు. దాంతో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ అక్క‌డికి చేరుకుని బుజ్జగించే ప్రయ త్నం చేశారు. అయినా రాహుల్ గాంధీ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ను తొల‌గించాల్సిందేన‌ని ప‌ట్టుప‌ట్టారు. అక్కడి నుంచి నేరుగా హోం మంత్రి అమిత్ షా దగ్గరకు వెళ్లిన కేంద్రం జితేంద్ర చౌద‌రి, మళ్లీ రాహుల్‌తో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆయన ఇక్కడి నుంచి కదలబోమ‌ని భీష్మించుకుని కూర్చున్నారు. దాంతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మ‌ల్లికార్జున ఖ‌ర్గే, ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాద‌వ్‌, ఎన్సీపీ నేత సుప్రియా సులే స‌హా కాంగ్రెస్‌ ఎంపీలు, నేత‌ల‌ ను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌‌స్టేషన్‌‌కు తరలించారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ విద్యార్థుల‌పై దాడి అంటే ప్ర‌తి భార‌తీయ కుటుంబంపై దాడితో స‌మానమ‌ని అన్నారు. దేశ విద్యార్థుల గొంతును విస్మ‌రించ‌లేర‌ని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -