తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్ సీఐటీయూ మహబూబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లం ఎల్లయ్య
నవతెలంగాణ – నెల్లికుదురు
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్ పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే చలో హైదరాబాద్ కు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్ సీఐటీయూ మహబూబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లం ఎల్లయ్య కోరినట్టు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ .. పంచాయతీ కార్మికుల వేతనాలు నేరుగా ప్రభుత్వమే వారి బ్యాంక్ అకౌంట్ ల ద్వారా పొందే పద్ధతిని మార్చి పంచాయతీల ద్వారా వేతనాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయాలని సంఘం నిర్ణయించుకున్నదని అన్నారు.
మార్చి 17న చలో హైదరాబాద్ కార్యక్రమానికి అన్ని జిల్లా కమిటీల సభ్యులు పెద్ద సంఖ్యలో కార్మికులను కదిలించి జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు విషయంలో జారీ చేసిన సర్క్యులర్‌ను ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రామకోటి, హెచ్ వెంకన్న ,చంద్రు, చాంద్ పాషా, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.



