విద్యార్థులపై దాడి నిజమే : ఆల్ట్ న్యూస్
న్యూఢిల్లీ : జూలై 20న సిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఛలో పార్లమెంట్’ కార్యక్రమంలో విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు జరిపిన దాడులపై వివాదం మరింత ముదురుతోంది. ఈ ఘటనకు సంబంధించి రోజుకో కొత్త ఆధారం వెలుగులోకి వస్తుండగా …. పోలీసులు మేకులు అమర్చిన లాఠీలతో విద్యార్థులపై దాడి చేశారనే ఆరోపణలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరలయ్యాయి.ఆ వీడియోలు నిజమే : స్వతంత్ర ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ ఆల్ట్ న్యూస్‌ఈ వీడియోలు నకిలీవని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. అనంతరం పిఐబి ఫ్యాక్ట్ చెక్ కూడా స్పందిస్తూ …. వైరల్ అవుతున్న వీడియోలు ఫేక్ అని, ఢిల్లీ పోలీసులు మేకులున్న లాఠీలను ఉపయోగించలేదని పేర్కొంది. అయితే స్వతంత్ర ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ ఆల్ట్ న్యూస్ నిర్వహించిన పరిశీలనలో …. ఆ వీడియోలు నిజమైనవేనని నిర్థారణ అయినట్లు తన కథనంలో స్పష్టం చేసింది. దీంతో ఈ అంశంపై మరింత చర్చ మొదలైంది.
పెల్లెట్ గన్స్‌తో దాడి చేశారు : మీడియాతో బాధిత యువకులు
మరోవైపు, ‘ఛలో పార్లమెంట్’లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్స్‌ను కూడా ఉపయోగించారన్న ఆరోపణలు బయటకు వస్తున్నాయి. గాయపడిన పలువురు విద్యార్థులు మీడియా ఎదుట తమ అనుభవాలను వెల్లడించారు. ఢిల్లీకి చెందిన 25 ఏండ్ల యువకుడు మీడియాతో మాట్లాడుతూ …. పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొంటున్న సమయంలో పోలీసులు తనపై పెల్లెట్ గన్స్‌తో కాల్పులు జరిపారని తెలిపాడు.
మేకులున్న లాఠీలతో బాదారు
- Advertisement -
- Advertisement -



