Saturday, July 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంముందుచూపు లేకే విద్యుత్‌ కోతలు

ముందుచూపు లేకే విద్యుత్‌ కోతలు

- Advertisement -


అన్ని రంగాల్లో కాంగ్రెస్‌ సర్కార్‌ విఫలం : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ-బొమ్మలరామారం

​కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడం వల్లే రాష్ట్రం అంధకారంలో ఉందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కట్ట సాయిరెడ్డి, సోలిపేట మాజీ సర్పంచ్ పూడూరీ నవీన్ గౌడ్ తల్లి అనారోగ్యంతో మృతి చెందగా ఇరు కుటుంబాలను హరీశ్‌‌రావు పరామర్శించారు. అనంతరం సోలిపేట విద్యుత్ సబ్‌ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. కరెంటు సరఫరా పరిస్థితులపై విద్యుత్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సాగు, తాగునీరు, విద్యుత్ సరఫరాలో పూర్తిగా విఫలమైం దన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి రోజు తాగునీరు అందించి రైతులకు అంతరాయం లేకుండా విద్యుత్ అందించిందని తెలిపారు. పరామ ర్శించడానికి వచ్చినప్పుడు చుట్టుపక్కల గ్రామస్తులు, మహిళలు.. రెండు రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని బాధలు చెప్పుకుంటున్నారన్నారు.14 గంటల కరెంటు కేవలం 12 గంటలు మాత్రమే వస్తుందని దానిలో గంటకొకసారి ట్రిప్ అవుతుందని తెలిపారు. నారు పోసుకునే సమయంలో కరెంటు కోత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కోతలకే పరిమితమైందని అన్నారు. రైతు బీమా పెండింగ్‌‌లో ఉన్నాయని చెప్పారని తెలిపారు. రైతులు దురదృష్టవశాత్తూ చనిపోతే కొండంత ధీమా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రైతు బీమా పథకాన్ని ప్రారంభించారన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మందికి రైతు బీమా రాకుండా ఆగిపోయాయన్నారు. గతంలో వారం రోజుల్లోగా రైతు కుటుంబం అకౌంట్‌‌లో డబ్బులు పడ్డాయన్నారు. రైతు బీమా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నావా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, తక్షణమే రైతు బీమా విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత, జిల్లా పరిషత్ చైర్మెన్ సందీప్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, సింగల్ విండో మాజీ చైర్మెన్ బాల్ నరసింహ, మాజీ ఎంపీపీ చిమ్ములు సుధీర్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -