Monday, July 27, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గ్రిడ్ కు సోలార్ ప్రాజెక్ట్ అనుసంధానం

గ్రిడ్ కు సోలార్ ప్రాజెక్ట్ అనుసంధానం

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ 
రెండు మెగావాట్ల పీఎం-కుసుమ్ సోలార్ ప్రాజెక్ట్ నిర్మల్ జిల్లా ముధోల్  మండలంలోని పిప్రి శివారులో రైతు పొద్దుటూరు ప్రేమలతాదేవి కిష్టరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు కావటం తో గ్రిడ్ కు అనుసంధానంచేశారు. సోమవారం మధ్యాహ్నం  ఎన్పీడీసీఎల్, రెడ్కో అధికారులు ఎస్ఈ జె.సుభాష్,డీఇఇ తిలక్, సమీప 33/11 కేవీ తరోడ సబ్ స్టేషన్ వద్ద గ్రిడ్కు విజయవంతంగా అనుసంధానం చేసి సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. సందర్భంగా ఎస్ఈ జె సుభాష్ మాట్లాడుతూ.. రైతులు తమ పంటపొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పీఎం-కుసుమ్ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు.

నిర్మల్ జిల్లాలో 15మెగావాట్లు 2,రెండు మెగావాట్ల వి త రోడా,బిద్రెల్లి,బుట్టాపూర్, గైడి పల్లి, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయన్నారు. వారు ఉత్పత్తి చేసిన ప్రతీ యూనిట్ కు అమౌంట్ డిస్కం చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎస్ ఎవల్యూషన్ ప్రతినిధులు డీపీ వర్మ, సునీల్, పి.ఆదిత్య రెడ్డి, ఏడీఈలు సంపత్ కుమార్, ఏఈలు విష్ణు, శ్రీకాంత్,  పి4 క్యూ  సొల్యూషన్స్ ప్రతినిధి లు టి.మధుసూదన్ రావు, ప్రదీప్ కుమార్ రెడ్డి ,డిపి వర్మ,సునీల్,ఎల్ ప్లోక్స్ ప్రతినిధులు పి.విక్రం పాటిల్,పి.రవీంద్ర, సిబ్బంది రాము,సాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -