- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి మండల పరిధిలోని మాదన్ హిప్పర్గా గ్రామంలో ఓటరు సవరణ ప్రక్రియను 100% విజయవంతంగా పూర్తి చేసిన బూత్ లెవెల్ అధికారులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు, కార్యదర్శి, సిబ్బందికి గ్రామ సర్పంచ్ బాచావార్ లక్ష్మణ్ గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా బీఎల్ఓలను శాలువలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఇద్దరు బిఎల్వోలు, ఇద్దరు బిఎల్ఎ లు, గ్రామ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



