Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జలసరి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం: సర్పంచ్ బాచవార్ లక్ష్మణ్

జలసరి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం: సర్పంచ్ బాచవార్ లక్ష్మణ్

- Advertisement -

నవతెలంగాణ–మద్నూర్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టనున్న జలసరి కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ సహకారంతో విజయవంతం చేయాలని మాదన్ హిప్పర్గా గ్రామ సర్పంచ్ బాచవార్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. డోంగ్లి మండలంలోని మాదన్ హిప్పర్గా గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్‌నీనో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన జలసరి కార్యక్రమంలో ప్రతి గ్రామస్తుడు భాగస్వామ్యం కావాలని కోరారు. నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపునకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం చేపట్టే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ గ్రామసభలో గ్రామ కార్యదర్శి పవన్ కుమార్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -