నవతెలంగాణ – వనపర్తి : ఇరిగేషన్ శాఖకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. భూసేకరణ పురోగతి, అవాంతరాల పై సమీక్షించడానికి గురువారం ఇరిగేషన్ ఇంజనీర్లు, ప్రత్యేక కలెక్టర్ భూసేకరణ అధికారితో కలెక్టర్ తన ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు. గణప సముద్రం, జంగమాయపల్లి, బుద్దారం, దావాజిపల్లి ఇరిగేషన్ కెనాల్ భూసేకరణ పనులపై ఇంజనీరింగ్ అధికారులు, ప్రత్యేక కలెక్టర్ భూసేకరణ నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూసేకరణలో అవాంతరాలు ఏమున్నాయని అడిగి తెలుసుకున్నారు.
భూసేకరణ చేయాల్సిన ప్రాంతాన్ని సర్వే చేసి సాధ్యమైనంత వరకు త్వరగా అవార్డు పాస్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంగనేనిపల్లి, దావాజిపల్లి రైతులతో మాట్లాడి ఒప్పించాలని సూచించారు. జిల్లాలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూసేకరణ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టీ వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ చంద్రశేఖర్, ప్రత్యేక కలెక్టర్ భూసేకరణ ఎన్. తిరుపతయ్య, సెక్షన్ సూపరింటెండెంట్ లక్ష్మీ, ఇరిగేషన్ డి. ఈ, ఎ. ఈ లు తదితరులు పాల్గొన్నారు.



