నవతెలంగాణ – డిచ్ పల్లి : భూగర్భ జలాలు పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రకటించిన జలసిరి కార్యక్రమం ద్వారా రైతులు ప్రజలు లబ్ధి పొందాలని ఇందల్ వాయి, డిచ్ పల్లి ఎంపివో శ్రీనివాస్ సూచించారు. జలసిరిపై గ్రామసభను నిర్వహించారు. సర్పంచ్ పోగుల అనిత సాయి కృష్ణ అధ్యక్షతన ఇందల్వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన వీబీ జీ రాంజీ చట్టంలో భాగంగా జలసిరి కార్యక్రమంపై గ్రామసభ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపివో మాట్లాడుతూ గ్రామానికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు సకాలంలో పనులు ప్రారంభించి పూర్తి చేసే విధంగా చూడాలన్నారు.
భూగర్భ జలాల సంరక్షణ, అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ఇంకుడు గుంతలు, ఫారం పాండ్లు, ఊట కుంటలు, కమ్యూనిటీ సోక్ ఫీట్స్, బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, రూఫ్ప్ రైస్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణా లు, భూగర్భ జలాలను పెంచే పనులను పూర్తి చేయడానికి నిర్దేశించిన లక్ష్యాలను వివరించారు. అనంతరం జలసిరి పోస్టులను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సర్పంచ్ పోగుల అనిత సాయి కృష్ణ , ఉప సర్పంచ్ కుంట సుదర్శన్, ఏపీవో ఓడ్డెం పోశెట్టి, కార్యదర్శి నాగేష్ , కిసాన్ ఖేత్ మండల అధ్యక్షులు ఎల్ ఐ సి గంగాధర్,వీవో అధ్యక్షురాలు, కారోబర్ నర్సయ్య, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, వార్డు సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



