– విధులు నిర్వహిస్తూనే మౌనదీక్ష పాటించిన సిబ్బంది..
– మంత్రి సీతక్క హామీ ఏమైంది.?
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఉపాధి హామీ ( VB-G RAM G) సిబ్బందికి జీతాలు అందక మూడు నెలలైన నేపథ్యంలో శుక్రవారం ఉపాది హామీ కార్యాలయం ఆవరణలో సిబ్బంది మౌన దీక్ష వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సకాలంలో జీతాలు అందక, మా కుటుంబాల పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. గత మూడు నెలలుగా జీతాలు రాకపోతే మేం ఎం తిని పనిచేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క రెండు సంవత్సరాల క్రితం మాకు పే స్కేల్ ఇస్తున్నాం అని పత్రిక ప్రకటనలో పేర్కొన్నప్పటికీ, ఆ హమీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క పెండింగ్ వేతనాలపై దృష్టి సారించి, మాకు పే స్కేల్ ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ విధులు నిర్వహిస్తున్న అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధి హామీ సిబ్బంది పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



