- Advertisement -
తన కూతురు వివాహ వేడుకకు రావాలని శుభలేఖలు అందజేత
నవతెలంగాణ-మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కూతురు పెళ్లి ఈ నెలలో జరగనుంది. ఈ క్రమంలో ఆయన గత వారంరోజులుగా రాజకీయ ప్రముఖులను కలిసి వివాహ పత్రికను అందజేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆదివారం హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను కలిసి తన కూతురు వివాహ పత్రికను అందజేశారు. అదేవిధంగా ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులకు ఆశీర్వదించాలని కోరారు. తప్పకుండా వివాహ వేడుకకు హాజరవుతామని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు.
- Advertisement -



