Sunday, August 2, 2026
E-PAPER
Homeఖమ్మంబేతుపల్లిలో వైభవంగా 'బోనాల' సంబురం 

బేతుపల్లిలో వైభవంగా ‘బోనాల’ సంబురం 

- Advertisement -

నవతెలంగాణ – సత్తుపల్లి
సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో ఆదివారం బోనాల పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. గ్రామ వీధుల గుండా మహిళా భక్తులు బోనాలు నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లారు. తొలుత బొడ్డురాయికి, ఆ తర్వాత అంకమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలతో గ్రామం వర్ధిల్లాలని దేవుళ్లను వేడుకున్నారు. ఈ ఏడాది తొలి బోనాన్ని గ్రామానికి చెందిన కొప్పుల శ్రీనివాసరావు-విశాలి దంపతుల నివాసం నుంచి ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -