Sunday, August 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెంటనే ఆలేరు రెవెన్యూ డివిజన్ గెజిట్ ను ప్రకటించాలి 

వెంటనే ఆలేరు రెవెన్యూ డివిజన్ గెజిట్ ను ప్రకటించాలి 

- Advertisement -

ఎమ్మెల్యే బిర్ల ఐలయ్యకు అఖిలపక్ష కమిటీ విజ్ఞప్తి
నవతెలంగాణ-ఆలేరు టౌను  

ఆలేర్ రెవెన్యూ డివిజన్ ఈ లిమిటేషన్ తో సంబంధం లేకుండా వెంటనే ఏర్పాటు చేస్తూ గెజిట్ ప్రకటించాలని, ఆలేర్ రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ, అఖిలపక్ష కమిటీ సభ్యులు  ముక్త కంఠంతో, రాష్ట్ర ప్రభుత్వ విప్పు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యని విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్య భవనం వద్ద అఖిలపక్ష కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఆలేరు రెవెన్యూ డివిజన్ విషయంపై చర్చించడానికి ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య అఖిలపక్ష కమిటీ సభ్యులను ఆహ్వానించడానికి స్వాగతిస్తున్నామన్నారు. స్థానిక గెస్ట్ హౌస్ లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు గురించి ఎమ్మెల్యేతో చర్చించామన్నారు.

చర్చలలో ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో 11 కొత్త రెవిన్యూ డివిజన్లో ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉన్నదని, ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తావన డీలిమిటేషన్ జరిగిన తర్వాత కొత్త డివిజన్లో అమలు చేయాలని ఆలోచనతో ఉన్నారని చెప్పారన్నారు. విషయంపై  కమిటీ సభ్యులు వ్యతిరేకించి, డిలిమిటేషన్ తోని సంబంధం లేకుండా మీరు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం, ఎన్నికల సందర్భంగా  పలుమార్లు త్వరలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారని, ఆలేరు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ,ఆలేరు రెవెన్యూ డివిజన్ అమలుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యని కోరారు. 

 ఎమ్మెల్యే స్పందించి త్వరలో రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి  కమిటీ సభ్యులను తీసుకెళ్లి, త్వరలో రెవెన్యూ డివిజన్ అమలు కావడానికి కృషి చేస్తానని చెప్పి మాకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ప్రెస్ మీట్ లో విచిత్ర పొత్తులు అని విమర్శించడం సరికాదన్నారు. ఆలేరు ప్రజల చిరకాల కోరిక  రెవెన్యూ డివిజన్ అమలు కావాలని కోరుతున్నారని, అభివృద్ధి కొరకు ఆలేరు రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు మా అఖిలపక్ష కమిటీ ఉద్దేశం కూడా అన్నారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ అధికార ప్రకటన కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని  కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ  కన్వీనర్ పసుపును వీరేశం , రాచకొండ జనార్ధన్  ,చెక్క వెంకటేష్ , మొరిగాడి రమేష్  ,రచ్చ రామ్ నరసయ్య , పంతం కృష్ణ  ,కర్రె అశోక్  ,ఎలుగల వెంకటేష్  ,కామిటికారీ అశోక్ , బేతి కృష్ణ హరి, ఎలుగల కుమారస్వామి, మంచన మల్లేశం, గొట్టిపాముల  శ్రీను, వడ్డేమాన్ బాలరాజ్ , ఎర్రం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -