Sunday, August 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తరాలు మారిన తరగని స్నేహబంధం

తరాలు మారిన తరగని స్నేహబంధం

- Advertisement -

ఘనంగా 1990 బ్యాచ్ స్నేహితుల ఆత్మీయ సమ్మేళనం 
నవతెలంగాణ-ఆలేరు టౌన్

ఆలేరు మండలంలో భావోద్వేగాల వెల్లువ మూడు దశాబ్దాలకు పైగా కాలం గడిచినా స్నేహబంధం మాత్రం చెక్కుచెదరలేదని ఆలేరు  పట్టణానికి చెందిన 1990 బ్యాచ్ స్నేహితులు మరోసారి నిరూపించారు. జీవిత ప్రయాణంలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో స్థిరపడినా, చిన్ననాటి జ్ఞాపకాలను పదిలంగా దాచుకున్న మిత్రులు ఒకే వేదికపై కలుసుకుని ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా చిన్ననాటి మధురస్మృతులను గుర్తు చేసుకుంటూ పాఠశాల రోజుల సంఘటనలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఆనాటి గురువులను, తరగతి గదులను, ఆటపాటలను, పరీక్షల అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎంతోకాలం తర్వాత కలుసుకున్న స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

స్నేహం అనేది కాలంతో కరిగిపోని అనుబంధమని, తరాలు మారినా నిజమైన స్నేహబంధం ఎప్పటికీ నిలిచిపోతుందని పలువురు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు నిర్వహించారు. అనంతరం జ్ఞాపికలు అందజేసుకుని గ్రూప్ ఫొటోలు దిగుతూ ఈ అపురూపమైన క్షణాలను చిరస్మరణీయంగా మార్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -