Tuesday, March 24, 2026
E-PAPER
HomeNewsతప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

- Advertisement -
  • ఎస్సై కృష్ణదేవ

నవతెలంగాణ-ఊరుకొండ: తప్పుగా ఏఐ ద్వారా తప్పుడు ప్రచారం చేసి సమాజంలో అశాంతి నెలకొనేలా చేస్తున్నట్టి వ్యక్తులపై చట్టపరమైన విధానాలతో చర్యలు తీసుకుంటామని ఎస్సై కృష్ణదేవ అన్నారు. మంగళవారం ఊరుకొండ మండల కేంద్రంలో ఎస్సై కృష్ణదేవ మాట్లాడుతూ.. ఏఐ ద్వారా తయారు చేసిన ఫొటోలో కనిపిస్తున్న విదంగా ఎక్కడ కూడా మేము ఎక్కడ కూడా అక్రమ కేసులు పెట్టలేదు, చట్టపరంగానే, వచ్చినట్టి ఫిర్యాదు ఆధారంగా కేసునమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఏఐ ద్వారా తయారు చేసినట్టి ఫొటోలో చూపినట్టుగా ఆ పోలీస్ అధికారులు ఎవరో ఎక్కడ పని చేస్తున్నారో తెలియదు, మాదారం గ్రామానికి గాని ఊర్కొండ మండలానికి గాని నాగర్కర్నూల్ జిల్లా కీ సంబందించిన ఫోటో కాదు అది ఏఐ జనరేటెడ్ ఫోటో అని స్పష్టం చేశారు. ఇట్టి కేసుకు సంబంచినట్టి రెండురోజులుగా ఇష్యూ నడుస్తుంది. నేను స్వయంగా వెళ్లి వాటికి సంబందించిన డాకుమెంట్స్ తీసుకొని రావాలని ఇరు పక్షాలకు చెప్పడం జరిగిందన్నారు. ఇట్టి విషయం పై అధికారులకు తెలిజేయడం జరిగిందనీ, ఆ సమయంలో అక్కడ ఉన్నట్టి వీరాస్వామిని కలిసి చెప్పడం జరిగిందని తెలిపారు. వారు కూడా డాకుమెంట్స్ తీసుకొని వస్తామన్నారు, ఇట్టి విషయాన్నీ సీఐకి తెలుపగ సీఐ వీరాస్వామి గారితో రెండు పర్యాయలు మాట్లాడటం జరిగిందని అన్నారు. అక్కడ ఎటువంటి తొందరపాటు చర్యలు గాని పనులు చేయవద్దు, తన దగ్గరికి సంబందించిన డాకుమెంట్స్ తీసుకొని వస్తే తను ఇరు పక్షలను విచారించి తగు చర్యలు తీసుకొని చట్ట పరిధిలో న్యాయం చేస్తామని చెప్పినట్లు తెలిపారు. వారు నేటి వరకు ఇటువైపు నుండి ఎవరు కూడా వీరాస్వామి గాని ఇతర నాయకులు గాని ప్రజలు గాని ఎవరు కూడా నన్ను గాని, సీఐ గారిని గాని, డిఎస్పీ గారిని కానీ ఎవరు సంప్రదించలేదు, ఇప్పటి వరకు డాకుమెంట్స్ తీసుకొని రాలేదు కాబట్టి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా చట్ట పరంగా ముందుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. ఇట్టి కేసులో ఎస్సి కమ్యూనిటీకీ సంబందించిన డాకుమెంట్స్ కూడా 2010 సంవత్సరమునకు సంబందించినది. అది వారే స్వయంగా వేసినట్టి ఫ్లెక్సీ లో తెలియ జేశారు. డాక్ మెంట్ 11266/2010. ఫిర్యాదు దారుడు యొక్క డాకుమెంట్స్ 1981 లో 628/2 సర్వే నెంబర్ డాక్ మెంట్ నెంబర్ 689/1981, 690/1981, 681/1981 మరియు 1988లో 10 గుంటల భూమి డాక్యుమెంట్ 2964/1988 పాస్ బుక్ నంబర్ TS03180110490. ఇందులో చట్ట పరంగానే ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -