Wednesday, August 5, 2026
E-PAPER
Homeఆదిలాబాద్12న హిందూ యువ సమ్మేళనం

12న హిందూ యువ సమ్మేళనం

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించనున్న “హిందూ యువ సమ్మేళనం” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విభాగ్ సహ ప్రచారక్ శ్రీ మీసారి ప్రకాష్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కళాశాల విద్యార్థి ప్రముఖ్ అక్షయ్ మాట్లాడుతూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ ఉత్సవాల భాగంగా యువతలో దేశభక్తి, ధర్మరక్షణ, కర్తవ్యనిష్ఠ, సామాజిక సేవాభావం జాతీయ చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో “హిందూ యువ సమ్మేళనం” నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నేటి యువత దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, మహనీయుల త్యాగాల గురించి ప్రతి యువకుడు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సమాజ సేవ, జాతీయ సమైక్యత, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం వంటి విలువలను యువతలో పెంపొందించేందుకు ఈ సమ్మేళనం వేదికగా నిలుస్తుందని చెప్పారు. ఆగస్టు 12న సాయంత్రం 5:00 గంటలకు ఆదిలాబాద్‌లోని రెవెన్యూ గార్డెన్స్, కలెక్టర్ చౌక్ వద్ద జరిగే ఈ హిందూ యువ సమ్మేళనానికి 15 నుండి 35 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు, యువకులు, మేధావులు హిందూ సమాజంలోని ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమాజానికి సేవ చేయాలనే స్ఫూర్తి, దేశభక్తి భావన, యువత బాధ్యతలపై ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -