- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని గోజేగావ్ గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టిన పారిశుద్ధ్య పనులను బుధవారం ఆ గ్రామ సర్పంచ్ భారత్ రాథోడ్, ఉపసర్పంచ్ బస్వంత్ పటేల్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, ప్రత్యేకంగా పరిశీలించారు. గ్రామంలోని ప్రతి వార్డులో కాల్లలో పేరుకుపోయిన తీసివేసే ప్రత్యేక కార్యక్రమాన్ని తలపెట్టామని కార్యదర్శి చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతం వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. దీంతో దోమల వ్యాప్తి తగ్గుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు.
- Advertisement -



