- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
హైదరాబాద్‌లోని మంత్రి క్వార్టర్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబును జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సతీసమేతంగా కలిశారు. ఈ క్రమంలో తమ కుమార్తె వివాహ వేడుకకు హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నూతన వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



