- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలో బుధవారం బాలికల వసతి గృహంలో మున్సిపల్ చైర్మన్ బిజన బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, తాసిల్దార్ వలిగొండ ఆంజనేయులు చేతుల మీదుగా విద్యార్థినీలకు నోట్ బుక్స్, ప్లేట్స్, కటోర, మగ్గులు, స్పూన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుపై పాటు సాధించాలన్నారు. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థుల కొరకు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పట్టుదలతో చదివి ఉత్తీర్ణతల శాతం పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ఆర్ శైలజ, విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



