రాష్ట్ర ప్రభుత్వ విప్పు,ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
నవతెలంగాణ-ఆలేరు టౌన్
విద్యార్థులను భావి భారత పౌరులుగా గురువులు, అధ్యాపకులు తీర్చిదిద్దాలని, రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల ఆవరణలో దీన శరణ్య సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ పాఠశాలలు, కళాశాలలో గురువుల చేత తీర్చి పెద్దబడుతుందన్నారు. గురువులు చెప్పే పాఠాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయన్నారు. విద్యతోపాటు సామాజిక బాధ్యత పెంపొందించుకోవాలన్నారు. క్రీడలలో రాణించాలన్నారు. ఉన్నత శిఖరాల అధిరోహించి, పాఠశాల కు ప్రాంతానికి గురువులకు తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, పాఠశాల ప్రిన్సిపల్ సురేఖ, గుండ్లగూడం సర్పంచ్ ఏసి రెడ్డి మంజుల మహేందర్ రెడ్డి,అధ్యాపకులు, విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు.



