Thursday, August 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైళ్ల కార్యకలాపాలు 
సజావుగా సాగేలా చూడాలి

రైళ్ల కార్యకలాపాలు 
సజావుగా సాగేలా చూడాలి

- Advertisement -

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ , అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్
ఉన్నతాధికారులతో భద్రతపై సమగ్ర సమీక్షా సమావేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌

రైళ్ల కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ , దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్ అధికారులను ఆదేశించారు. సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల భద్రతపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రమాదవశాత్తు జారిపడటం, నీటిలో మునిగిపోవడాన్ని నివారించడానికి, నిర్మాణ స్థలాల చుట్టూ, ముఖ్యంగా లోతైన గుంతలు తవ్వుతున్న సున్నితమైన ప్రదేశాలలో కంచె ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. జనరల్ మేనేజర్, నెలరోజులుగా అధికారులు, సూపర్‌వైజర్‌లు నిర్వహించిన భద్రతా తనిఖీల సారాంశాన్ని సమీక్షించారు. వర్షాకాలంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి స్టేషన్లలో,సెక్షన్లు, ట్రాక్‌లలో అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా సిబ్బందికి అవగాహన కల్పించారు. జోన్ వ్యాప్తంగా కొనసాగుతున్న భద్రతా చర్యలను సమీక్షిస్తూ, ఇంజినీరింగ్, సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్, మెకానికల్ ఎలక్ట్రికల్ విభాగాలతో సహా పలు విభాగాలు చేపట్టిన కార్యక్రమాలను జనరల్ మేనేజర్ పరిశీలించారు. తనిఖీల సమయంలో ఏవైనా లోపాలను గుర్తించినట్టయితే వెంటనే సరిదిద్దాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -