Thursday, March 26, 2026
E-PAPER
Homeజిల్లాలుఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్

ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్: ప‌శ్చిమాసియా యుద్ధంతో గ్యాస్, పెట్రోల్ కొర‌త‌తో జ‌నం అల్లాడి పోతున్నారు. అదే విధంగా యుద్ధం సాకుతో నిత్యావ‌స‌ర ధ‌ర‌లు పెరుగుతున్నాయి.ప‌లు రోజుల నుంచి చికెన్ ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో చికెన్ పేపర్ రేటు రూ. 360 నుంచి రూ. 370 వరకు ప‌లుకుతుంది. అయితే ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ చేయనున్నట్లు రాష్ట్ర చికెన్ షాపు ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. బుధవారం ఎల్బీనగర్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్ నాయకులు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇవ్వాల్సిన మార్జిన్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోజురోజుకు చికెన్ ధరలు పెరుగుతున్నా తమకు వచ్చే లాభం మాత్రం తగ్గించారని ఆవేదన చెందారు. ప్రస్తుతం కిలో చికెన్ పేపర్ రేటు రూ. 360 నుంచి రూ. 370 వరకు ఉండగా, షాపు నిర్వహణ కోసం ఆ ధరపై మరో పది రూపాయలు అదనంగా కలిపి అమ్మాల్సి వస్తుందని యజమానులు తెలిపారు. అయితే వినియోగదారులు మాత్రం పేపర్ రేటుకే ఇవ్వాలని పట్టుబడుతుండటంతో కస్టమర్లతో గొడవలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు.

పౌల్ట్రీ కంపెనీలు తమ నిర్ణయం మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కారం చూపాలని కోరారు. ఏప్రిల్ 1లోపు చర్చలు జరపకపోతే నిరసనలతో రోడ్లెక్కుతామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -