Saturday, August 8, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురేషన్‌‌పై14 రకాల నిత్యావసర సరుకులివ్వాలి

రేషన్‌‌పై14 రకాల నిత్యావసర సరుకులివ్వాలి

- Advertisement -

​సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ
‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈనెల 15న రాష్ట్ర ప్రభుత్వం 1.5 కోట్ల కుటుంబాలకు స్మార్ట్‌ ‌రేషన్‌ ‌కార్డులతోపాటు వాటి ఆధారంగా 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులు అందించాలని కోరారు. ప్రస్తుతం కార్డుపై మనిషికి ఆరు కేజీల బియ్యం ఇస్తున్నారే తప్ప అదనంగా ఎలాంటి సరుకులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పేద కుటుంబాల ఆదాయాలు పెరగట్లేదనీ, దీంతో పౌష్టికాహారానికి దూరమవుతున్నాయని వాపోయారు. సరుకుల ధరలు పెరిగిపోవడం వల్ల రక్తహీనత ఏర్పడి, బరువు తక్కువున్న పిల్లలు పుడుతూ అనారోగ్యాలపాలవుతున్న పరిస్థితి ఉందని ఎత్తిచూపారు. పేదలకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తక్షణమే రేషన్ కార్డుదారులకు ప్రతి మనిషికీ 6 కేజీల బియ్యంతో పాటు, అదనంగా కందిపప్పు, మంచి నూనె, కారం, పసుపుతో పాటు మొత్తంగా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -