3.42 కోట్ల మందికి 6 కిలోల సన్నబియ్యం :
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈనెల 15న సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ద్వారా తెలంగాణలోని 3.42 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారని ఆయన తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ప్రతి అర్హుడికి ప్రతి నెల 6 కిలోల నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందించనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అమలుకు ప్రతి నెల సుమారు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తామని వెల్లడించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సంగారెడ్డిలో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు రాష్ట్రంలోని మిగిలిన 32 జిల్లాల్లోనూ అదే రోజు ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



