శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా ‘బైకర్’. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా డాల్బీ, ఎపీక్యూ, 4 డీఎక్స్, పీసీఎక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
-ఇది 100% థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా. డాల్బీ విజన్‌లో కూడా షూట్ చేశాం. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా సౌండ్ డిజైన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
-బైక్ అనేది అందరికీ ఒక ఎమోషన్. ఇందులో రేసింగ్‌తో పాటు చాలా మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంది. ఫాదర్-సన్ మధ్య ఉండే ఎమోషన్ ఆడియన్స్‌కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది.
-ఈ సినిమాలో రేసింగ్ సీక్వెన్స్‌లను రియల్ రేసర్స్‌తో చిత్రీకరించాం. ఆ సమయంలో చాలా యాక్సిడెంట్లు జరిగాయి. ఈ సినిమా రెండు టైమ్‌లైన్స్‌లో జరుగుతుంది.
-ఇండియాలో ఈ స్పోర్ట్స్‌కి రావాల్సిన పాపుపరిటీ రాలేదు. ఇందులో రాజశేఖర్ క్యారెక్టర్‌తో ఇదే అంశాన్ని ప్రెజెంట్ చేస్తున్నాం. ఇండియాలో శ్యామ్ కొఠారి అనే వెటరన్ రేసర్ ఉన్నారు. కానీ ఆయనకి క్రికెట్లో కపిల్ దేవ్‌కి వచ్చినంత గుర్తింపు రేసింగ్‌లో రాలేదు. కపిల్ దేవ్‌కి ఉన్నంత గుర్తింపు శ్యామ్ కొఠారికి కూడా రావాలనేదే నా మోటీవ్. ఇది ఫిక్షనల్ స్టోరీ అయినప్పటికీ రేసింగ్ విషయంలో కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ను స్ఫూర్తిగా తీసుకున్నా.
-రాజశేఖర్ కోచ్ అలాగే ఫాదర్ క్యారెక్టర్లో కనిపిస్తారు. ఆయన క్యారెక్టర్ రెగ్యులర్ ఫాదర్‌లా ఉండదు. ఆయన చుట్టూ ఒక కథ తిరుగుతుంది. ఆయన ఆ క్యారెక్టర్ చేయడంతో ఎమోషన్ ఇంకా స్ట్రాంగ్ అయ్యింది.
-యూవీ క్రియేషన్స్‌లో చేసిన ప్రతి సినిమా విజువల్‌గా, టెక్నికల్‌గా చాలా గ్రాండ్‌గా ఉంటుంది. కథ నచ్చితే ఆ కథ కోసం ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేస్తారు. ఈ సినిమా కోసం శర్వా దాదాపుగా 23 కేజీలు తగ్గారు. ఆయన పెర్ఫార్మెన్స్ టెర్రిఫిక్‌గా ఉంటుంది. శర్వా ఈ సినిమాను తన కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అని చెప్పారు. మాళవిక ఈ సినిమాలో చాలా కీలక పాత్ర పోషించింది. వంశీతో ట్రైలర్ అద్భుతంగా ఉందని ప్రభాస్ చెప్పారు. ఆయన మా సినిమా కోసం ట్వీట్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది.
-జిబ్రాన్ ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. చివరి 40 నిమిషాలు ఇందులో అవుట్‌స్టాండింగ్ మ్యూజిక్ ఉంటుంది.
-దిల్ రాజుకి ఈ సినిమా చాలా నచ్చింది. నా నెక్స్ట్ సినిమా ఆయనతోనే చేయబోతున్నారు. చాలా డిఫరెంట్‌గా ఉండే కథ అది.
బైక్ రేసింగ్, ఫ్యామిలీ ఎమోషన్‌కి బాగా కనెక్ట్ అవుతారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



