నవతెలంగాణ – డిచ్ పల్లి : సభ్యత్వ నమోదు కార్యక్రమం విద్యార్థులు విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజానికి తమ వంతు సేవ అందించాలని పలువురు వాక్తలు సూచించారు.మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్లబ్‌ను యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్. లక్ష్మణ చక్రవర్తి ప్రారంభించారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో మానవతా విలువలు, సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
క్లబ్‌ను ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజానికి తమ వంతు సేవ అందించాలని,నషా ముక్త్ భారత్ అభియాన్ నోడల్ అధికారి ప్రొఫెసర్ కె. లావణ్య మాట్లాడుతూ.. యువత సామాజిక సమస్యలపై అవగాహన పెంపొందించుకుని ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ కో- ఆర్డినేటర్ ప్రొఫెసర్ కె. అపర్ణ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వంటి సంస్థల సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో సేవా స్ఫూర్తి, నాయకత్వం మరియు సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు అధిక సంఖ్యలో రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకుని సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లక్ష్యాలు, సేవా కార్యక్రమాలు, సభ్యత్వం యొక్క ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్. అతీక్, డాక్టర్. మహమ్మద్ అలీ, డాక్టర్. శ్రీనివాస్, డాక్టర్. భ్రమరాంబిక, డాక్టర్. ఎన్. స్వామి, పీఆర్ఓ డాక్టర్. కె.వి. రమణాచారి, అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తమ మద్దతును తెలిపారు.



