ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి భిక్షపతి మాదిగ
నవతెలంగాణ-మిడ్జిల్
అసమానత లేని సమాజ నిర్మాణం కోసం మరో ఉద్యమానికి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను సిద్ధం చేద్దామని, ఈ పోరాటాన్ని కార్యకర్తలు ముందుండి నడిపించాలని పాలమూరు జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి, భిక్షపతి మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో సురేష్ మాదిగ అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఎమ్మార్పీఎస్ మిడ్జిల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..గ్రామాలలో నాయకులను చైతన్యం చేస్తూ, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల, నిర్మాణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలనీ, ఉద్యమ ప్రతిభతో పోరాటాన్ని సాగించాలని కోరారు.
మాదిగ యువతతో, గ్రామ, మండల కమిటీలను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. సెప్టెంబర్ నెల 9న ఛలో వరంగల్ ఎమ్మార్పీఎస్, జాతీయ సదస్సు విజయవంతం చేయడం కోసం గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయి నుండి మండల స్థాయి కమిటీలను వరంగల్ లో జరుగుతున్న సభకు తీసుకొచ్చే బాధ్యత మండల ఇన్చార్జిలదేనని చెప్పారు. ఈ కార్యక్రమంలోటైగర్ జంగయ్య మాదిగ, గణేష్ మాదిగ, శివ మాదిగ, బరిగెల సురేష్ మాదిగ, బుచ్చయ్య, కావలి వెంకటయ్య,సుభాష్,రాజు, ఆంజనేయులు,శ్రీధర్, అంజి,కృష్ణయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.



