నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఈ సంవత్సరం కొత్తగా ఉచితంగా అందిస్తున్న నోటు పుస్తకాలను మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి విజయదేవి ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ నుపంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విద్యార్థులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇప్పటివరకు ఉచిత విద్యతోపాటు ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం నుంచి పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా ఉచిత నోటుబుక్కులను కూడా పంపిణీ చేస్తుంది. ఇంకా కళాశాలలో డిజిటల్ బోధన తో పాటు నూతన ప్రయోగ పరికరాలు నిట్, ఎంసెట్ శిక్షణ తరగతులు బోధిస్తున్నారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పదవ తరగతి పాసైన విద్యార్థులు ఇంకా ఎవరైనా ఉంటే ఈనెల 15 లోపు కళాశాలలో ప్రవేశం పొందాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కళాశాలలో ఎకో క్లబ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తాడిచర్ల ఉపసర్పంచ్ బొబ్బిలి రాజు,కళాశాల అధ్యాపకులు, సిబ్బంది,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
జూనియర్ కళాశాలలో ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



