- Advertisement -
మానవ సంబంధాలే
మారణహోమాలు
దినదినము పెరుగుతున్న నేరప్రవృత్తి
ఆస్తికోసం అమ్మనాన్నలను
అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు
ఎవరు ఎవరి చావు కోరుతున్నారో ఏమో
క్షణికావేశంలో తల్లి పిల్లలను బలిగొట్టు
మాతప్రేమే మరణమదంగమాయే
నిజమైన ప్రేమేనో
ఆకర్షణలో కలిగిన ఆశేనో
తల్లిదండ్రుల తలల్నే తెంపుతున్న
పుత్ర హంతకులు
వర్తమాన పెళ్ళిల్లు పెళ్ళో/పెటాకులో
ఆలుమగలు కట్టుకునే గోపురంలో
అపార్ధాల, అనుమానాల మత్యుద్వారం
ఈ వ్యవస్థకు మార్పు ఒక్కటే
అపార్థాలు, అనుమానాలు, అహంకారాలు
తొలగితే మానవ సంబంధాల పురోగతి
ఒకరికి ఒకరు తోడుగా నీడగా
కలిసి ఉంటే కలదు సుఖం
తల్లిదండ్రులు పిల్లల కొరకు
పిల్లలు తల్లిదండ్రుల కొరకు
వేచిచూసే ప్రేమే బలం
రఘువరన్, 9010483021
- Advertisement -



