నవతెలంగాణ-హైదరాబాద్: యుద్ధోన్మాదంతో చెలరేగిపోతున్న అమెరికా-ఇజ్రాయిల్ ప్రపంచశాంతికే కాదు ఇందన సంక్షోభానికి తెరలేపాయి. ఫిబ్రవరి 20న మొదలైనా పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు తీవ్రతరమవుతుంది. మొదట్లో యుద్ధ మంటలు ఇజ్రాయిల్-అమెరికా-ఇరాన్ దేశాల్లో అలుముకున్నాయి. అటు తర్వాత నెమ్మదిగా గల్ఫ్ దేశాలను చుట్టుముట్టాయి. అంతటి ఆగకుండా ప్రపంచదేశాలకు మంటలు వ్యాపించకున్న సెగలు తగులుతున్నాయి.
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ కారణంగా హర్మూజ్ సంధి గుండా చమురు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ప్రపంచదేశాల్లో గ్యాస్ కొరత రోజురోజుకు తీవ్రమవుతుంది. ఈక్రమంలోనే గ్యాస్ సిలిండర్ల రేట్లు పెరగడమే కాకుండా వాటి వినియోగంపై పరిమితులు విధించారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల రేట్లను మోడీ సర్కార్ రెండు సార్లు పెంచింది. దేశంలో గ్యాస్ కొరత లేదంటునే పలు ఆంక్షలు విధిస్తోంది. ప్రాధాన్యత క్రమంగా సదురు సిలిండర్లను సరఫరా చేయాలని మోడీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గ్యాస్ స్టావ్ స్థానంలో కట్టెల పోయ్యి వాడకం మొదలైంది.
అదే విధంగా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ రేట్లు కూడా పెరగనున్నాయి. ఇప్పటికే ప్రీమియం పెట్రోల్, ఇండస్ట్రీయల్ డీజిల్ రేట్లును మోడీ ప్రభుత్వం పెంచింది. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి. పది రోజుల కింద పెట్రోల్ బంకుల ఎదుట నో స్టాక్ బోర్డులు సందర్శమిచ్చాయి. దీంతో ఒక్కసారిగా జనాలు పెట్రోల్, డీజిల్ కోసం ఎగబాడ్డారు. బిందెలు, క్యానులు, బకెట్‌ల్లో ఆయిల్ నింపుకొని పైశాచిక ఆనందాన్ని పొందారు. అదే విధంగా సీఎన్‌జీ కోసం కార్లు, ఆటోవాలాలు రేయింబవళ్లు బంకుల ఎదుట క్యూలైన్‌లో పడిగాపులు కాచారు.
మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో చమురు ధరలు కొండెక్కాయి. ఆ దేశ కరెన్సీలో లీటర్ పెట్రోల్, డీజిల్ 500 పలుకుతుంది. అయితే తాజా పరిణామాలతో ఎలక్ట్రిక్ వాహనాలతో కాస్తా ఉపశమనం లభించినా..అతి త్వరలో సైకిల్ వాడకం మొదలు కానుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సామెత చందంగా మరోసారి మన పాత కాలంనాటి సైకిల్ వినియోగంలోకి రానుంది. ఇంకేందుకు ఆలస్యం సైకిల్ ఉన్నవాళ్లు.. తుప్పు దుల్పి ఎంచక్కా సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీంతో కట్టెల పొయ్యి తరహాలోనే సైకిల్‌కు కూడా స్వాగతం పలుకుదాం.



