స్టాన్లీ ఓరియంటేషన్ కార్యక్రమంలో
శిరీష సోమయాజుల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇంజినీరింగ్ విద్యార్థులు ఏఐ సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని ఇంజనీరింగ్ నెస్ డిజిటల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శిరీష సోమయాజుల సూచించారు. సోమవారం హైదరాబాద్ లోని స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శిరీష సోమయాజుల మాట్లాడుతూ ఏఐను సృజనాత్మకంగా బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని కోరారు. భవిష్యత్తులో దాదాపు ప్రతి రంగంలోనూ ఏఐ కీలక పాత్ర పోషించబోతోందని వివరించారు. మహిళలు విద్యావంతులైతే సమాజం అభివృద్ధి చెందుతుందని, వారు అన్ని రంగాలతో పాటు నాయకత్వంలోనూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యూఎస్ డెలివరీ కిన్డ్రిల్ సొల్యూషన్ డైరెక్టర్, మార్కెట్ లీడర్, ఉపేంద్ర పిసిపాటి మాట్లాడుతూ ప్రపంచంలో మారుతున్న కొత్త సాంకేతికతను నేర్చుకునేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని సూచించారు. నేర్చుకోవాలనే జిజ్ఞాసే కొత్త ఆలోచనలకు, సృజనాత్మకతకు, ఆవిష్కరణలకు దారి తీస్తుందని వివరించారు. విద్యార్థులు క్యూరియాసిటీ, బలమైన ఫండమెంటల్స్, నిరంతర అభ్యాసం, సృజనాత్మక ఆలోచనను అలవర్చుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గత విద్యా సంవత్సరంలో పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు. కళాశాల యాంటీ- ర్యాగింగ్ స్క్వాడ్ ధ్వర్యంలో పరేడ్ నిర్వహించి, విద్యార్థులతో యాంటీ ర్యాగింగ్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమానికి తిథులుగా రాజ్ కుమార్ బోనగిరి ( డైరెక్టర్, బ్లాంక్అప్), శ్రీనివాస్ కలిగుట్ల (అసోసియేట్ డైరెక్టర్, ఐబీఎం కిన్డ్రి) హాజరయ్యారు. కార్యక్రమంలో కళాశాల సెక్రెటరీ, కరస్పాండెంట్ కె.కృష్ణారావు, డైరెక్టర్, మేనేజ్‌మెంట్ సభ్యులు టి.రాకేష్ రెడ్డి, ఆర్. ప్రదీప్ రెడ్డి, అకడమిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏ.వినయ బాబు, ప్రిన్సిపాల్ డా. బి.ఎల్.రాజు తదితరులు పాల్గొన్నారు.
ఏఐ సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



