నవతెలంగాణ-హైదరాబాద్ : వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని, సకాలంలో వైద్య సహాయం పొందాలని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచించింది. ఈ వ్యాధులను చాలా వరకు నివారించగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇవి ప్రజారోగ్య సవాలుగా నిలుస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యం, ఊహించని వైద్య ఖర్చులకూ కారణమవుతున్నాయి.
ఇప్పటికే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ , అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలని సూచించింది. ఇదే నేపథ్యంలో, కేసులు పెరిగినప్పుడు వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి ఆసుపత్రులలో తగినన్ని పడకలు, మందులు, రోగ నిర్ధారణ పరికరాలు, రక్తం, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కూడా సూచించింది.
ఊహించని వైద్య అత్యవసర పరిస్థితులు కుటుంబాలపై ఆర్థిక భారాన్ని మోపుతాయని చెబుతున్న కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, ఈ క్రింది నివారణ చర్యలను చేపట్టాలని సిఫార్సు చేస్తోంది:
1. మీ ఇల్లు , పరిసరాలను శుభ్రంగా ఉంచ్చుకోండి. దోమలు వృద్ధి చెందేందుకు అవకాశమున్న కూలర్లు, బకెట్లు, పూలకుండీలు, టైర్లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు , ఇతర పాత్రల నుండి నిలిచి ఉన్న నీటిని తొలగించండి.
2. దోమల నివారణ మందులను వాడండి, పూర్తిగా చేతులను కప్పి ఉంచే దుస్తులు ధరించండి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తుల కోసం దోమల తెరలను ఏర్పాటు చేయండి.
3. మీకు తరచుగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, అలసట లేదా దోమల ద్వారా సంక్రమించే వ్యాధులకు సంబంధించిన ఇతర లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి. సొంత వైద్యం చేసుకోవద్దు.
4. వేగంగా కోలుకోవడానికి, సమస్యలను తగ్గించడానికి, చికిత్స సమయంలో తగినంత నీరు తాగుతూ ఉండండి, మీ డాక్టర్ సూచనలను ఆచరించండి.
5. వైద్య చికిత్సల వల్ల కలిగే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి మీ ఆరోగ్య బీమా కవరేజీని క్రమం తప్పకుండా సమీక్షించండి. ఇటీవలి కాలంలో పాలసీలు ‘డాక్టర్ ఆన్ కాల్’ వంటి వర్చువల్ కన్సల్టేషన్ సేవలను అందిస్తున్నాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల లక్షణాలు కనిపించినప్పుడు ఈ సేవలు ముందుగా తోడ్పడతాయి.
6. దోమల ద్వారా సంక్రమించే అన్ని వ్యాధులకూ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. ఈ వ్యాధులలో చాలావాటిని డాక్టర్ సలహా, సరైన చికిత్సా విధానాలను పాటించడం ద్వారా ఇంట్లోనే నయం చేయవచ్చు.
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ నివారణ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడంలోనూ, ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడంలోనూ వ్యాధిని ముందుగానే గుర్తించడం, సాధారణ నివారణ చర్యలు తోడ్పడతాయి.



