నవతెలంగాణ – కామారెడ్డి: విద్యారంగ అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తున్న విద్యాదాత, ప్రముఖ పారిశ్రామికవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని బుధవారం స్వదేశానికి చేరుకున్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఆయన 30 రోజుల పాటు అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని తెలుగు ప్రజలతో మమేకమయ్యారు.
పర్యటన అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సుభాష్‌రెడ్డికి ఆయన అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ అమెరికా పర్యటన విజయవంతంగా సాగిందని, అక్కడి తెలుగు సమాజంతో ఆత్మీయంగా గడిపిన అనుభూతి ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.విద్య, సామాజిక సేవా రంగాల్లో మరింతగా సేవలందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. యువతకు మెరుగైన విద్యా అవకాశాలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తనవంతు సహకారం అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.
అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలు తనకు అందించిన ఆత్మీయత, గౌరవం మరువలేనిదని అన్నారు. సుభాష్‌రెడ్డికి స్వాగతం పలికిన వారిలో జనగామ గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, బీబీపేట మండల మాజీ వైస్ ఎంపీపీ కప్పర రవీందర్‌రెడ్డి, వెంకట్‌గౌడ్, అశోక్‌గౌడ్, జనగామ ఉప సర్పంచ్ పాత స్వామి, నారాయణరెడ్డి, శేఖర్, మోకాల హనుమంత రెడ్డి, జనార్దన్ రెడ్డి, బోదాసు సాయికుమార్, సిహెచ్ రవి, సిద్ధరామిరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనతో కలిసి ఫొటోలు దిగుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.



