Friday, August 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం

సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం

- Advertisement -

అప్పనపల్లి శివారులో బావిలో పడిన కారు
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు జలసమాధి

నవతెలంగాణ-మిరుదొడ్డి/దుబ్బాక
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు జలసమాధి అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన ధన్ల రాజు(33), తన భార్య భాగ్య(30), ఇద్దరు పిల్లలతో కలిసి బుధవారం రాత్రి 7 గంటల సమయంలో సిద్దిపేట నుంచి కారులో స్వగ్రామానికి తిరిగి వస్తున్నాడు. సిద్దిపేట నుంచి బయలుదేరిన వారు అర్ధరాత్రి అయినా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అప్పనపల్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లినట్టు గుర్తించారు. కారు బావిలో పడిన విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో నలుగురు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. సహాయక బృందాలతో కలిసి పోలీసులు అర్ధరాత్రి బావిలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో బల్వంతాపూర్, అప్పనపల్లి గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు కన్నీరుము న్నీరయ్యారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద పరిస్థితిని పరిశీలించారు. అనంతరం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను పరిశీ లించి, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -