Friday, August 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబుల్లెట్‌ ట్రైన్‌ కోసం

బుల్లెట్‌ ట్రైన్‌ కోసం

- Advertisement -

కొనసాగిన రిలే నిరాహార దీక్షలు
​ఉద్యమానికి రైతు కూలీ సంఘం మద్దతు
పంజాబ్‌ యువకుల సంఘీభావం


నవతెలంగాణ–సూర్యాపేట

​సూర్యాపేట మీదుగా జాతీయ రహదారి–65కు సమాంతరంగా బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌ను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష బుల్లెట్‌ ట్రైన్‌ సాధన పోరాట సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారం 7వ రోజుకు చేరుకున్నాయి. రైతు కూలీ సంఘం నాయకులు దీక్షలో పాల్గొని ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు బోడ బాలస్వామి మాట్లాడుతూ.. “పోరాడితే పోయేదేముంది.. బానిస సంకెళ్లు తప్ప” అంటూ బుల్లెట్‌ ట్రైన్‌ అలైన్‌మెంట్‌ మార్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన బుల్లెట్‌ ట్రైన్‌ను పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చట్టసభల్లో, ఎన్నికల ప్రచారాల్లో ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తామని చెప్పే పాలకులు. ప్రజలకు ప్రయోజనం కలిగే బుల్లెట్‌ ట్రైన్‌ సూర్యాపేట మీదుగా వెళ్లేలా కేంద్రం ప్రకటించిన తర్వాత అలైన్‌మెంట్‌ మారుస్తున్నా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సూర్యాపేటకు ఇప్పటికే రైల్వే లైన్‌ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్‌ చేశారు.

​​పంజాబ్‌ యువకుల సంఘీభావం
​సూర్యాపేటలో ఉపాధి కోసం వచ్చి పట్టణంలో స్థిరపడిన పంజాబ్‌కు చెందిన యువకులు బుల్లెట్‌ ట్రైన్‌ ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధికి ఉపయోగపడే బుల్లెట్‌ ట్రైన్‌ సూర్యాపేట మీదుగా వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు కూలీ సంఘం నాయకులు బయ్య రామచంద్రు, బెల్లి నాగరాజు, కుంచం వెంకన్న, బయ్య సతీష్‌, కోడి బాబు, ఇరుగు వెంకటేష్‌, బయ్య లింగయ్య, బత్తుల గుర్వయ్య, బయ్య గంగయ్య, సత్తుపల్లి రాములు, ఇరుగు నాగయ్య, వెంకన్న రమేష్‌, కృష్ణయ్య, శ్రీనివాస్‌రెడ్డి, పుల్లారెడ్డి, కొమురయ్య, సత్తయ్య, పన్నీరు వాసుదేవరావు తదితరులు దీక్షలో కూర్చున్నారు. దీక్షకు అఖిలపక్ష నాయకులు కుంట్ల ధర్మార్జున్‌, నెమ్మది వెంకటేశ్వర్లు, కొత్తపల్లి శివకుమార్‌, డేవిడ్‌కుమార్‌, చల్లమల్ల నరసింహ, జీడి భిక్షం, వనితక్క, సట్టు నాగయ్య, బొమ్మిడి లక్ష్మీనారాయణ, పేర్ల నాగయ్య, మట్టపల్లి సైదులు, నవిలే ఉపేందర్‌, కిరణ్‌, ఎర్ర అఖిల్‌కుమార్‌ సంఘీభావం తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -