సినిమా టికెట్ ధరలకు సంబం ధించి తెలంగాణ ప్రభుత్వం విడు దల చేసిన కొత్త జీవో తెలుగు చిత్ర సీమను బలోపేతం చేయటానికి, పరిశ్రమ ఎదుగుదలకు తోడ్పడేం దుకు తీసుకున్న గొప్ప నిర్ణయం అని యాక్టీవ్ తెలుగు ఫిల్మ్ ప్రొడూసర్స్ గిల్డ్ సంతోషం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. ఐమాక్స్, డాల్బీ సినిమా, హెచ్‌డిఆర్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో రూపొందే భారీ బడ్జెట్ సినిమాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరం. ఈ పరిస్థితులను గమనించిన ప్రభుత్వం అర్హత ఉన్న సినిమాల టికెట్ ధరల పెంపునకు ఒక స్పష్టమైన, నియంత్రిత విధానాన్ని అందించిందని గిల్డ్ అభిప్రాయ పడింది.
ఈ జీవో మీద గిల్డ్ స్పందనను ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
టికెట్ ధరల పెంపు అనేది ప్రతి సినిమాకు స్వయంచాలకంగా వర్తించదు. అర్హత ఉన్న భారీ చిత్రాలు మాత్రమే ధరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ అధికారులు ప్రతి ధరఖాస్తును పరిశీలించిన తర్వాతే అనుమతి ఇస్తారు.
థియేటర్ ఏసీ, నాన్-ఏసీ, స్పెషల్ లేదా మల్టీఫ్లెక్స్ ఏదైనా, ఎక్కడ ఉన్నా సామాన్య ప్రేక్షకులకు సినిమా అందుబాటులో ఉండ టానికి థియేటర్ మొత్తం సీట్లలో 25% నాన్-ప్రీమియం కేటగిరికి తప్పనిసరిగా కేటాయించాలి.
రోజుకు 5 షోలకు అనుమతి ఇవ్వడం వల్ల పెద్ద సినిమాలకు ఉన్న డిమాండ్ త్వరగా తగ్గుతుంది. దీని వల్ల థియేటర్లపై ఒత్తిడి త్వరగా తగ్గి, చిన్న, మధ్యతరహా బడ్జెట్ సినిమాలకు ఎక్కువ స్ర్కీన్లు లభిస్తాయి.
సినీ కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయటానికి ఈ విధానం దోహద పడుతుంది.
ఈ విధానం కేవలం టికెట్ ధరలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది నూతన పెట్టుబడులను, కొత్త సాంకేతికతను, చిన్న సినిమాలను, వేలాది మంది సినీ కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించే ఒక బలమైన వ్యవస్థను నిర్మిస్తుంది. అలాగే మెరుగైన అవకాశాలకు మంచి అవకాశం ఉంటుంది. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమ భవిష్యత్ కూడా అత్యద్భుతంగా ఉంటుం గిల్డ్ సంతోషం వ్యక్తం చేసింది.
తెలుగు సినిమాకు ఒక ప్రగతిశీల నూతన అధ్యాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



