Tuesday, April 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంతంగి గ్రామానికి బస్సు పునరుద్ధరణ కోరుతూ వినతి..

పంతంగి గ్రామానికి బస్సు పునరుద్ధరణ కోరుతూ వినతి..

- Advertisement -

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్ :  మా గ్రామానికి గ్రామానికి వచ్చే ఆర్టీసీ  బస్సు సర్వీసును పునరుద్ధరించాలని గ్రామ ప్రజలు ఆర్టీసీ రీజనల్ మేనేజర్‌కు మంగళవారం ఉప సర్పంచ్ బోయ సదానందం ఆధ్వరంలో వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఉప సర్పంచ్ సదానందం మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దిల్‌సుఖ్‌నగర్ నుండి పంతంగి గ్రామానికి నడుస్తున్న 555పీ నంబర్ గల బస్సు గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.

ఈ బస్సు ద్వారా గ్రామ ప్రజలు ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు సమీప ప్రాంతాలకు సులభంగా రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు.అలాగే గ్రామంలోని విద్యార్థులు విద్యాభ్యాసం కోసం, రైతులు మరియు వ్యాపారస్తులు తమ పనుల కోసం ఈ బస్సుపై ఆధారపడుతున్నారని చెప్పారు.

అయితే ఇటీవల ఈ బస్సు సర్వీసు నిలిపివేయడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కావున ప్రజల సౌకర్యార్థం 555పీ బస్సు సర్వీసును వెంటనే పునఃప్రారంభించాలని RTC అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సప్పిడి లింగారెడ్డి,గుండెపురం ప్రతిభ నరేష్, గాడ్దుల శ్వేత ప్రవీణ్,బండ శేఖర్,బొమ్మని రాజశేఖర్,బాతరాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -