Sunday, August 23, 2026
E-PAPER
Homeఖమ్మంజాతీయ చెస్ పోటీలకు 'సాయిస్ఫూర్తి విద్యార్థినుల ఎంపిక

జాతీయ చెస్ పోటీలకు ‘సాయిస్ఫూర్తి విద్యార్థినుల ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
హైదరాబాద్ సమీపంలోని భానురు డీఏవీ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-17 చెస్ పోటీల్లో సత్తుపల్లి మండలం  గంగారం ‘సాయిస్ఫూర్తి డీఏవీ’ విద్యార్థినులు విశేష ప్రతిభ కనబరిచారు. ఈ పోటీలలో సాయిస్ఫూర్తి డీఏవీ పాఠశాలకు చెందిన వినుకొండ శ్రాగ్వీ, భవ్య శ్రీలక్ష్మి, దేదీప్తి, సాత్విక జాతీయస్థాయి చెస్ పోటీలకు ఎంపికయ్యారు. టీమ్ కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రాగ్వీ జట్టును అద్భుతంగా నడిపించి జాతీయస్థాయికి అర్హత సాధించేలా చేసింది.

​ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, చైర్మన్ దాసరి ప్రభాకరరెడ్డి, ప్రిన్సిపాల్ శేష సాయిశ్రీ విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు. జట్టు విజయానికి కృషి చేసిన కెప్టెన్ శ్రాగ్వీని ఆమె తల్లిదండ్రులు సుజాత, వెంకటేశ్వరరావులతో పాటు పాఠశాల పీఈటీలు కుమార్, రామిశెట్టి అనిత కొనియాడారు. జాతీయస్థాయి పోటీల్లోనూ రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -