Tuesday, August 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజా ఉద్యమాలకు లోటు

ప్రజా ఉద్యమాలకు లోటు

- Advertisement -


సారంపల్లి మల్లారెడ్డి మృతికి
మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి సంతాపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

​సీపీఐ(ఎం) అగ్ర నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నాయకులు చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మల్లారెడ్డి మృతికి సంతాపం తెలిపారు. వరంగల్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి కమ్యూనిస్టు పార్టీకి, రైతాంగ సాయుధ పోరాటానికి ఆకర్షితుల య్యారని పేర్కొన్నారు. సీపీఐ(ఎం)రాష్ట్ర నాయకుల్లో మల్లారెడ్డి ఒక గొప్ప పేరు సాధించారని తెలిపారు. రైతాంగ సమస్యలపై అనునిత్యం పోరాటం చేశారని, అఖిల భారత స్థాయి రైతు నాయ కుడిగా ఎదిగారని గుర్తు చేశారు. ఆయన ఏ బాధ్యత తీసుకున్నా దానికి న్యాయం చేసేవారని, నిగర్వి అని పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -