మున్నూరు కాపులకు అడై సౌ పచాస్ పేరు వచ్చింది..

మహారాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే తోటా లక్ష్మికాంతారావు
నవతెలంగాణ –  మద్నూర్
అన్నం పెట్టే అన్నదాతలే మున్నూరు కాపులు. ఆనాటి కాలంలో పంటలు అత్యధికంగా పండించే మున్నూరు కాపులకు ఆనాటి కాలం రాజులు ఒకసారి 250 మందికి,  మరొకసారి 50 మందికి పంటల అభివృద్ధి గురించి పిలిచి మాట్లాడినందుకే మున్నూరు కాపులకు అడై సౌ పచ్చాస్ అని పేరు వచ్చిందని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అన్నారు. బుధవారం నాడు మద్నూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో మున్నూరు కాపు ముద్దుబిడ్డ, మహారాష్ట్ర ప్రభుత్వ రెండవ ముఖ్యమంత్రి మారుతి రావు సాంబశివ కన్నావార్ జయంతి వేడుకలు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు హాజరయ్యారు. మారుతీ రావు సాంబశివ మున్నూరు కాపు ముద్దుబిడ్డ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.  అనంతరం సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నం పెట్టే అన్నదాతలే మున్నూరు కాపులని పేర్కొన్నారు. ఆనాటి రాజుల కాలంలో మున్నూరు కాపులు అత్యధికంగా పంటలు పండించడం, పంటలు అత్యధికంగా పండించే వారు ఎవరనే దానిపై ఒకసారి 250 మందిని పిలిపించి, ఆ తర్వాత 50 మందిని పిలిపించుకొని పంటల అభివృద్ధి గురించి తెలుసుకోవడమే మున్నూరు కాపులకు అడై సౌ పచ్చాస్ అని పేరు వచ్చిందని గుర్తు చేశారు. మహారాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా మున్నూరు కాపు ముద్దుబిడ్డ జయంతి వేడుకలు జరుపుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు. మద్నూర్ మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. మున్నూరు కాపులు ఎందరో ధనవంతులు ఉన్నారని, కొందరు మాత్రమే దాతలుగా పేరు ప్రతిష్టలు పొందుతున్నారని, మున్నూరు కాపులో ఎందరో వెనుకబడి ఉన్నారని, అలాంటి వారి కోసం ప్రత్యేకంగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, ధనికులు అలాంటి వారికి సహాయ సహకారాలు అందించాలని, ప్రభుత్వపరంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేకు మద్నూర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. మండలంలోని గ్రామాల వారీగా మున్నూరు కాపుల సంఘం నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మండల అధ్యక్షులు సారంగులవారు, గంగారం గ్రామ అధ్యక్షులు డాక్టర్ బండి వార్ విజయ్, ప్రధాన కార్యదర్శి సందుర్ వార్ హనుమాన్లు, ఉపాధ్యక్షులు కర్ల వార్ సాయిలు, అనుము వార్ హనుమాన్లు, కోశాధికారి తైదల్ చందర్ గ్రామంలోని ప్రతి బేడ సంఘం సభ్యులు, మున్నూరు కాపు ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు.
Spread the love