నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలో బుధవారం ఈద్ మిలాద్-ఉన్-నబీ పర్వదిన వేడుకలు స్తానిక ముస్లీం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జామియా మజీద్ నుండి ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఖాతిజ మజీద్-జామియా మజీద్ వరకు చేరుకుంది. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చూపిన శాంతి, ప్రేమ, సోదరభావం, మానవత్వం, పరస్పర గౌరవం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆకాంక్షించారు.
ఈ పవిత్ర పర్వదినం ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, ఐక్యత, ఆరోగ్యం, అభివృద్ధి నింపాలని, జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామన్నారు. కార్యక్రమంలో జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి సాయగౌడ్ , బస్వపూర్ గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ, డీసీసీ ప్రధాన కార్యదర్శి షైక్ ఇమ్రాన్, జుక్కల్ ఉపసర్పంచ్ షైక్ ఫిర్దోస్,మైనారిటీ అధ్యక్షులు షాదుల్, మీలాద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ షాఖిల్ , మత పెద్దలు చిన్నారు గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.



