కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు బాలాజీ నాయక్
నవతెలంగాణ-నల్లికుదురు : మండలంలోని రత్తిరాం తండాలో ఘనంగా తీజ్ పండగ వేడుకను నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుగులోతు బాలాజీ నాయక్ తెలిపాడు గురువారం తీజ్ పండగ సంప్రదాయాలను పాటిస్తూ మహిళలు, యువత, గ్రామ పెద్దలు మరియు తండావాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువత పాల్గొనడం వేడుకలకు మరింత శోభను తీసుకువచ్చింది అని అన్నారు.
రత్తిరాం తండా ప్రజల ఐక్యత, సంప్రదాయ సంస్కృతి, ఆత్మీయతకు ఈ తీజ్ పండగ వేడుకలు ప్రతీకగా నిలిచాయి. వేడుకలను విజయవంతం చేసిన తండావాసులు, నాయకులు, మహిళలు, యువత అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తండావాసులు పాల్గొన్నారు
రత్తిరాం తండాలో తీజ్ పండగ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



