నవతెలంగాణ-రాయికల్: మండలంలోని ఒడ్డెలింగాపూర్ గిరిజన సంక్షేమ మినీ గురుకులంలో 2026–27 విద్యా సంవత్సరానికి అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నైట్ వాచ్ ఉమెన్-1,ఆయా-1 పోస్టుల భర్తీకి అర్హులైన గిరిజన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ డి.ఎస్.వెంకన్న తెలిపారు. ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత సాధించిన ఎస్‌టీ మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.మినీ గురుకులం ఉన్న గ్రామం లేదా సంబంధిత మండలానికి చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.ఆసక్తి,అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హత,ఇతర ధ్రువపత్రాల రెండు జిరాక్స్ సెట్లు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో కలిసి సెప్టెంబర్ 7 సాయంత్రం 5 గంటలలోపు ఒడ్డెలింగాపూర్ మినీ గురుకుల ప్రధానోపాధ్యాయురాలికి దరఖాస్తు సమర్పించాలని సూచించారు.పూర్తి వివరాలకు 9652141962 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.



