మాజీ ఎంపీ మాలోతు కవిత
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని కాచికల్ గ్రామ మాజీ సర్పంచ్ గణపురం సోమయ్య మృతి చెందడం బాధాకరమని మహబూబాద్ పార్లమెంటు మాజీ ఎంపీ మాలోత్ కవిత తెలిపారు. సోమవారం వారి స్వగృహానికి కాచికల్ గ్రామానికి చేరుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మృతి చెందిన మాజీ సర్పంచ్ గణపురం సోమయ్య గ్రామ అభివద్ధి కోసం జిల్లావ్యాప్తంగా పేద ప్రజల కోసం ఎన్నో రకాల ఉద్యమాలను చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచి, వారి అభివృద్ధికి బాటలు వేశారనీ అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మృతి చెందడం జిల్లాకే తీరనిలోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సంకినేని కిరణ్ రావు , ఆగ్రామ మాజీ ఎంపీటీసీ ప్రకాష్,నల్లని నవీన్ రావు ,భాస్కర్ రావు , పాశం రమేష్ రవి తదితరులు పాల్గొన్నారు.
మాజీ సర్పంచ్ గణపురం సోమయ్య మృతి బాధాకరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



