నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను, బ్రాహ్మణ కొత్తపెళ్లి ఆఖరి వాగులోని ఇసుకను సోమవారం క్షేత్రస్థాయిలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండి, ఐఏఎస్ వీపీ గౌతమ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్దిదారులు నిబంధనల ప్రకారమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకై మన ఇసుక- మన వాహనం అనే వెబ్ సైట్ లో ఇసుకను బుక్ చేసుకుని వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సింగారం కుమార్, హౌసింగ్ ఏఈ అనిల్, స్థానిక సర్పంచ్ పులి వెంకన్న, ఉప సర్పంచ్ మంచాల వెంకన్న, పంచాయతీ నెల్లికుదురు బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ కార్యదర్శులు దేవయ్య, ఎర్ర రవి, జిపిఓ సందీప్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రత్నపురం యాకయ్య, నాయకులు మద్ది రాజేష్, కారోబార్ రవితో పాటు సిబ్బంది ఉన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన హౌసింగ్ ఎండీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


