Monday, April 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభూ దందాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ తోడు దొంగలు

భూ దందాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ తోడు దొంగలు

- Advertisement -

ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

భూ దందాలు చేయడంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తోడు దొంగలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ విమర్శించారు. సోమవారం కర్ణాటకలోని గుదిబండలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి ముందు పేదల మద్దతు కోరే పార్టీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల భూములనే కబ్జా చేస్తున్నాయని మండిపడ్డారు. కేరళ ఎన్నికల్లో విలువైన భూములపై కాంగ్రెస్‌ కన్ను పడిందనీ, అందుకే రేవంత్‌ రెడ్డి, డీకే. శివకుమార్‌ లాంటి నేతలు పోటాపోటీగా ప్రచారం చేస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని విమర్శించారు. అయినప్పటికీ ప్రజలు మూడోసారి ఎల్‌డీఎఫ్‌కు అధికారం కట్టబెడతారని ధీమా వ్యక్తంచేశారు. పరిశ్రమల పేరిట వేల ఎకరాల భూములను కేటాయిస్తూ, అభివృద్ధి పేరుతో వాటితో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారన్నారని విమర్శించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం 2020లో భూ సీలింగ్‌ చట్టాన్ని సవరించి వ్యవసాయేతరులకు అపరిమితంగా భూములు కొనుగోలు చేసే అవకాశం కల్పించిందన్నారు. అదే విధానాన్ని ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం మరింత వేగంగా అమలు చేస్తోందని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పెరగడానికి ప్రధాన కారణం ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకపోవడమేననీ, భూములను పేదలకు పంచిపెడితేనే కొనుగోలు శక్తి పెరిగి ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ తరుణంలో భూములను రక్షించేందుకు భూ స్వాధీన ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -