నవతెలంగాణ -ముధోల్ : ముధోల్ నియోజకవర్గం లో ని భైంసా సబ్ డివిజన్ పరిధిలో జరిగిన ట్రాన్స్‌ఫార్మర్‌ల దొంగతనాల కేసులో దొంగలను పట్టుకోని, అరెస్టు చేసినట్లు భైంసా ఎఎస్పీ పత్తిపాక సాయి కిరణ్ తెలిపారు. బైంసా ఏఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను మీడియాకు వెల్లడించారు. భైంసా సబ్ డివిజన్ పరిధిలో 8 నెలల వ్యవధిలో ట్రాన్స్ఫార్మర్ ల చోరీ ఘటనలు 33 జరిగినట్లు చెప్పారు. నిందితులను పట్టుకోవడానికి నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నాలుగు స్పెషల్ టీంలను నియమించమన్నారు. అయితే నిందితులను ముధోల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని తెలిపారు .సబ్ డివిజన్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్ చోరీ ఘటనలపై ముధోల్ పోలిస్ స్టేషన్ లో 8 కేసులు, తానుర్ లో11, కుబీర్ లో 4,బాసరలో 3, భైంసా టౌన్ లో3, భైంసా రూరల్ లో 2, కుంటాల,2 చొప్పున కేసులు నమోదు అయినట్టు చెప్పారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ఎంతో కృషి చేశారని ఎఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితులు మహారాష్ట్రలోని దర్మబాద్ తాలుకా కు చెందిన పెడికే గణేష్,ఘేగర్ దీపక్,గంటలవాడ్ సాయినాథ్ , గజానంద్, నక్కలవాడ్ గణేష్,బైంసాకు చెందిన పిట్టోల పోశేట్టి,లను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల నుండి 250కిలోల రాగితీగలు,4బైకులు,7 సేల్ ఫోన్లు,పానలు, కటింగ్ ప్లేయర్, తదితర వస్తులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కేసులను చేదించి, నిందితులను పట్టుకున్న ముధోల్ సీఐ రవీందర్ నాయక్, బాసర ఎస్ హెచ్ ఓ దీపక్, ముధోల్,తానుర్, ఎస్సై బిట్ల పెర్సిస్, జుబేర్, ఎఎస్ఐ నర్సింగ్, కానిస్టేబుల్ లు రాజేందర్, అమర్నాథ్ ,పోతన్న, గజేందర్ ,వెంకట సాయి, నరేంద్ర చారి, గగన్, సందీప్, వెంకట్రావు తదితరులను ఎఎస్పీ అభినందించారు.
ట్రాన్స్ఫార్మర్ దొంగలు అరెస్టు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



