Tuesday, September 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందారి తప్పలే.. ధైర్యం కోల్పోలే

దారి తప్పలే.. ధైర్యం కోల్పోలే

- Advertisement -

కాంగ్రెస్ హామీలు అమలు చేయకున్నా
ప్రతిపక్షం నిలదీస్తలే.. కొట్లాడుతలే
ఎన్నికలప్ప్పుడు ఒట్లు.. తర్వాత తిట్లు రేవంత్ స్ట్రాటజీ
తండ్రినీ బిడ్డను పాపిన ప్రశాంత్‌రెడ్డికి ఉసురు తగుల్తది
పాంచజన్య సభలో టీఆర్‌ఎస్ అధినేత్రి కవిత భావోధ్వేగం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి

‘ఆడబిడ్డ కష్టాల్లో ఉంటే అక్కున చేర్చుకోవాల్సింది పోయి కర్కశంగా నన్ను బయటకు పంపారు. నాలుగేండ్లుగా సీబీఐ,ఈడీ నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా దారి తప్పలే.. ధైర్యం కోల్పోలే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల బతుకులు మారలేదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని విస్మరించినా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ పోరాడుతలే. అందుకే తెలంగాణకు చేయాల్సింది ఇంకా ఉందని పంతంతో పార్టీ పెట్టినట్టు’ టీఆర్‌ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం పాంచజన్య సంకల్ప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ‘తెలంగాణ వస్తే మన బతుకులు మారాతాయని ఊపిరిబిగపట్టి, పిడికిలెత్తి పోరాటం చేశాం. కానీ తెలంగాణ వచ్చాక బతుకులు మారలేదు. మనకు మంచి జరగలేదు. అలాంటప్పుడు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పదవుల కోసమే అయితే ఏదో ఒక పార్టీలోకి వెళ్లొచ్చు. నేను చూడని పదువులు లేవు. అనుభవించని జీవితం లేదు. కానీ ప్రజలు అభివృద్ధి చెందాలి. గుణాత్మక మార్పు రావాలి. బంగారు తెలంగాణ అంటు నాలుగిండ్లే బంగారం అయ్యాయి. ఇప్ప్పుడు బంగారు కాదు.. బహుజన తెలంగాణ కావాలి. పదవుల కోసం కాకుండా ప్రజల కోసమే పార్టీ పెట్టా. పబ్బత్‌తో అడుగుతున్నా.. మళ్లీ నాకు నిజామాబాద్ జిల్లా ప్రజలు ధైర్యం ఇవ్వాలి’ అని అన్నారు.
​తండ్రినీ బిడ్డను పాపింది ప్రశాంత్‌రెడ్డే
నన్ను ఎందుకు తీసేశారో అర్థం కావటం లేదన్నారు. సొంతూరుకురావటంతో ఆవేదనతో ఆపుకుందామనుకున్నా కన్నీళ్లు వస్తున్నాయన్నారు. అలాగని నన్ను పిరికిదాన్ని అని మాత్రం అనుకోవద్దని స్పష్టం చేశారు. ప్రశాంత్‌రెడ్డిని కేసీఆర్ పెద్దకొడుకుగా చూస్తే.. ఆయన మాత్రం బీఆర్‌ఎస్ ఓడిన రెండు రోజులకే కాంగ్రెస్‌లో చేరేందుకు వేం నరేందర్‌రెడ్డితో అమెరికా వెళ్లి మంతనాలు చేశారని ఆరోపించారు. తండ్రిని, కూతురును పాపడంలో ప్రశాంత్‌రెడ్డిది మొదటి పాత్ర అని, హరీశ్‌ రావును, సంతో‌శ్‌ రావు ను క్షమిస్తానేమో గానీ ప్రశాంత్ రెడ్డిని క్షమించనని తన ఉసురు తాకుతుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేపటితో వెయ్యి రోజులు అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేసిన దాఖలాలు లేవని అన్నారు. ‘దొంగ హామీలతో గద్దెనెక్కిన వాళ్లను మనం నిలదీయాలా వద్దా? కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సి బీఆర్‌ఎస్ ఎందుకు మౌనంగా ఉంది? అని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -