టీజీపీఎస్సీ మాజీ సభ్యులు సుమిత్రానంద్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇందిరమ్మ రాజ్యమని చెప్తున్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీజీపీఎస్సీ సభ్యులు సుమిత్రానంద్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆడపిల్లల రక్షణ గాలిలో దీపంలా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై రోజురోజుకూ లైంగిక దాడులు పెరిగిపోతు న్నాయన్నారు. గురుకుల పాఠశాలలో చదివిన పేదింటి బిడ్డ నర్సుపై లైంగికదాడికి పాల్పడి హత్య చేయడం దారుణమని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి వద్ద హోం శాఖ పెట్టుకుని మహిళల భద్రతపై సమీక్ష చేయడం లేదని విమర్శించారు. ఖమ్మంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి భవనంపై నుంచి తోసేశారని అన్నారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల భద్రతపై సమీక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు షకీలారెడ్డి, కె మమత తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



